అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీయించారు.
నిజాంసాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం (Pitlam) మండలంలోని అల్లాపూర్ (Allapur) గ్రామానికి చెందిన గైని పండరి(28) నిజాంసాగర్ ప్రాజెక్టు చూసి బాసర (Basara) వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయలు దేరాడు. ప్రాజెక్టు వద్ద ఉన్న ఉద్యానవనంలో శనివారం సాయంత్రం కాలుజారి ప్రాజెక్టులో పడిపోయాడు.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు (Nizamsagar Police) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెస్క్యూ టీంతో (Rescue team) పండరి కోసం గాలించగా.. ఆదివారం ఉదయం పండరి మృతదేహం లభ్యమైంది. తండ్రి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.