అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మొత్తం అల్లాడిపోయింది. వరదల ప్రభావంతో (floods Effect) తీవ్ర నష్టం వాటిల్లగా ఓ కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. ఇప్పటికే ముగ్గురు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా ఓ వైద్యుడు గోడ కూలి మృతి చెందాడు.
తాజాగా కామారెడ్డి (Kamareddy) జీఆర్ కాలనీ (GR Colony) వద్ద వాగు ప్రవాహంలో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. అయితే ముందుగా ఆ మృతదేహం ఓ న్యాయవాదిగా భావించారు. అయితే మృతుడి జేబులో ఓటర్ ఐడీ కార్డు లభించడంతో చిన్నమల్లారెడ్డి (Chinna mallareddy) గ్రామానికి చెందిన కర్రెవాల బాలరాజు (50)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలరాజు ఇంటికి తిరిగి రాలేదు.
బాలరాజు బయటకు వెళ్లిన కాసేపటికి భారీ వర్షంతో వరదలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. బాలరాజు కోసం తిరిగినా ఆచూకీ లభించలేదు. ఆదివారం జీఆర్ కాలనీ వాగులో కొట్టుకొచ్చిన మృతదేహం నర్సరీ పక్కన పొదల్లో చిక్కుకోగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి బాలరాజుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.