అక్షరటుడే, బోధన్: Kickboxing Karate Championship | జర్మనీ దేశంలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్షిప్ (World Kickboxing Karate Championship) పోటీల్లో బోధన్ యువకుడు సత్తా చాటాడు. తన ప్రతిభతో కాంస్యపతకాన్ని సాధించాడు.
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీకి చెందిన అబ్దుల్ నబీల్ జర్మనీలో జరిగిన కిక్ బాక్సింగ్ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించాడు. ఛాంపియన్షిప్లో కాంస్యపతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు స్వదేశానికి తిరిగివచ్చిన నబీల్ను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఇతర ప్రముఖులు ఘనంగా సన్మానించారు.
