అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు (Youth Congress leaders) వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై వారు ఆందోళనకు దిగారు. మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా బీటీనగర్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు తలారి నవీన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.