Bodhan | ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు
Bodhan | ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

అక్షరటుడే, బోధన్‌:Bodhan | మండలంలోని కల్దుర్కి గ్రామం(Kaldurki village)లో అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక టిప్పర్లను(Sand tippers) సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.

బోధన్‌ మండలంలోని సిద్ధాపూర్‌ siddhapur quary శివారులో గల మంజీర నది(Manjeera River) నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలిస్తున్నారు. అయితే, కల్దుర్కి మీదుగా ఓవర్‌ లోడ్‌, అధిక వేగంతో వెళ్తుండడంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు. ఓవర్‌ స్పీడ్‌(Over Speed)పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. చర్యలు తీసుకోని పక్షంలో దారులు దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు.