అక్షరటుడే, బోధన్ : Bodhan Municipality Congress Win | బోధన్ మున్సిపాలిటీని కాంగ్రెస్ (Congress) కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో చివరకు కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.
Bodhan Municipality Congress Win | వార్డుల వారీగా చూస్తే..
బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality)లో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అందులో 18వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే 12వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. బీజేపీ మూడు స్థానాల్లో, బీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో గెలిచాయి. ఒకస్థానంలో కాంగ్రెస్, ఇండిపెండెంట్ మధ్య పోరాటం జరుగుతోంది. కాంగ్రెస్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నాయకులు టపాసాలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు.
పోలీసుల భద్రత..
ఈ సందర్భంగా పట్టణంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఫోర్స్‌ను సైతం సిద్ధం చేసి ఉంచారు. కౌంటింగ్ హాల్ లోపలికి అనుమతి ఉన్నవారిని మాత్రమే పంపించారు.