అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ మున్సిపల్ కమిషనర్ (Bodhan Municipal Commissioner) జాదవ్ కృష్ణపై (Jadav Krishna) ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు చేశారు.
ఆయన గతంలో ఆదిలాబాద్ (Adilabad) మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్‌గా (Revenue Officer) విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఇంటినంబర్ల అసెస్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Bodhan Municipality | ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌లో..
ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌లో మున్సిపల్ భూమిపై ఆస్తి పన్ను అంచనా, డోర్ నంబర్ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని సర్వే నెం.170లో నిర్మాణం లేకపోయినప్పటికీ డోర్‌నంబర్ ఇవ్వడం, మున్సిపాలిటీ పరిధిలో 50 అడుగుల వెడల్పులో అక్రమంగా నిర్మించిన నిర్మాణానికి డోర్ నంబర్ ఇవ్వడంపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.