Bodhan
Bodhan | హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్.. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ (Municipal Commissioner Krishna Jadhav) శుక్రవారం హోటళ్లతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు హోటళ్లతో పాటు టిఫిన్​ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లలో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యంగా నాణ్యత లోపిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. అదేవిధంగా పలుచోట్ల పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రస్తుత వర్షాకాలంలో కావడంతో నీరు నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే పారిశుధ్య పనులు ఎప్పటికప్పడు చేపట్టాలని చెప్పారు.