అక్షరటుడే, బోధన్ : Bodhan Municipal Chairperson | బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గురువారం తూము పద్మ (Thoomu Padma) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆమె గురువారం కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌గా ఫైల్‌పై సంతకాలు చేశారు.
Bodhan Municipal Chairperson | ఇటీవల జరిగిన ఎన్నికల్లో..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తులో భాగంగా మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని (Municipal Office) ఛైర్మన్ ఛాంబర్లో తూము పద్మ అధికారికంగా గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకాన్ని ఉంచిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.