అక్షరటుడే, బోధన్ : Thoomu Padma Chairperson | బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్ (Bodhan Municipal Chairperson)గా తూము పద్మ శరత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈమేరకు ఆమె మున్సిపల్ కార్యాలయం (Municipal Office)లో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
Thoomu Padma Chairperson | తూము పద్మ నేపథ్యం..
పట్టణంలోని 35వ వార్డుకు చెందిన తూము పద్మ కాంగ్రెస్ అభ్యర్థినిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆమె భర్త తూము శరత్‌రెడ్డి సైతం 25వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన తూము పద్మ కౌన్సిలర్‌గా గెలిచి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా భార్యాభర్తలు ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి బల్దియా ఎన్నికల్లో వారిద్దరు ఇద్దరూ కాంగ్రెస్ పోటీచేసి విజయం సాధించారు. అలాగే తూము పద్మ మరోసారి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్ ఇలియాజ్ అలీ ఎన్నికయ్యారు.