అక్షరటుడే, బోధన్ : Bodhan Municipal Chairman Election | బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. బీజేపీ ఎన్నికకు దూరమైంది.
Bodhan Municipal Chairman Election | బీజేపీ అభ్యర్థులు..
బోధన్ (Bodhan) పట్టణంలో మొత్తంగా 38 వార్డులు ఉండగా..కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 12, బీజేపీ 3, ఇండిపెండెంట్ 1, బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ (Congress), ఎంఐఎం (MIM) కలిసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఎంఐఎం, కాంగ్రెస్ అనైతిక పొత్తును నిరసిస్తూ బీజేపీ (BJP)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఛైర్పర్సన్ ఎన్నికకు హాజరు కాలేదు. 11వ వార్డు నుంచి గెలిచిన కొల్లిపాక రేణుక బాలరాజ్, 33వ వార్డు నుంచి గెలుపొందిన గుంత అబ్బవ్వ, 29వ వార్డు నుంచి విజయం సాధించిన లక్ష్మీ పూజిత బల్దియాకు సోమవారం హాజరుకాలేదు. వీరు ముగ్గురు బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం (Sub Collector Office)లో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.