అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan mla | నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాల్‌తో పాటు, కార్యాలయం గదుల నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆయన కంఠేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంఠేశ్వర్ ఆలయంలో భక్తుల కోసం ఒక హాల్‌తో పాటు, కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగినన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంకిరెడ్డి రాజిరెడ్డి, రైతు కార్పొరేషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆలయ ఈవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.