అక్షరటుడే, బోధన్: Bodhan Mla Sudarshan Reddy | బోధన్ నియోజకవర్గానికి మూడు విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో (Irrigation Guesthouse) ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని జాడి జమాల్పూర్ (Jadi Jamalpur), సాలూర మండలం, హనుమాన్ ఫారంలకు విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా జాడిజమాల్పూర్ గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Taher bin Hamdan, Chairman of the Urdu Academy), డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (DCC President Manala Mohan Reddy), ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas), మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఏడీఈ కన్ స్ట్రక్షన్ తోట రాజశేఖర్, బోధన్ టౌన్ ఏఈ నాయిని కృష్ణ, శరత్ రెడ్డి, గంగాశంకర్, దాము, పులి శ్రీనివాస్, జాడి జమాల్పూర్ గ్రామస్థులు దేవదానం, శ్రీనివాసరావు, చిన్నయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.