అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని బోధన్ సహకార సంఘం మహాజన సభలో (Mahajana Sabha ) సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు బుధవారం ఛైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్ (Chairman Udmir Laxman) అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు, రైతులు (Farmers) మాట్లాడుతూ, బోధన్ సహకార సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్ మండలంలోని మినార్పల్లి సహకార సంఘం కార్యదర్శిగా నియమించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఉమాకాంత్ ప్రతిఒక్కరైతుకు అందుబాటులో ఉంటూ ఎనలేని సేవలు అందిస్తున్నారని.. ఆయన బదిలీని వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్, బోధన్ వీడీసీ ఛైర్మన్ గంగాధర్ రావ్ పట్వారి, సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వీరభద్రారావ్, డైరెక్టర్లు తోకల సాయన్న, హీర నాయక్, శంకర్, మాసుల శ్రీనివాస్, సింగం బాగయ్య, బేగరి పోశెట్టితో పాటు సహకార సంఘం సభ్యులు, రైతులు సాయి, పోతారెడ్డి, నక్క లింగారెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.