అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణవాసులకు పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) ఆదేశించారు. బోధన్ మున్సిపాలిటీపై (Bodhan Municipality) శనివారం ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ముందుగా కమిషనర్ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం పట్టణ శివారులోని డంపింగ్ యార్డును ఆయన సందర్శించారు. డంపింగ్‌యార్డులో చేయాల్సిన అభివృద్ధి పనులను కమిషనర్‌తో చర్చించారు. అదేవిధంగా శక్కర్‌నగర్ ఎక్స్ రోడ్లో పైప్‌లైన్ లీకేజీ పనులను ఆయన పరిశీలించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట పాటు బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) తదితరులున్నారు.