118
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | కాంగ్రెస్ నిజామాబాద్ నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఇటీవల పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను (MLC Balmuri Venkat) హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయాలపై వారిరువురు చర్చించారు. అలాగే మొదటి విడత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల (panchayat elections) గురించి మాట్లాడారు. నగరంలో కాంగ్రెస్ పురోభివృద్ధికి మరింత కృషి చేయాలని బల్మూరి వెంకట్ బొబ్బిలి రామకృష్ణకు సూచించారు.