44
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Congress | కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌తో కలిసి సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పీసీపీ చీఫ్‌తో పాటు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పాల్గొన్నారు.