HomeతెలంగాణVikarabad | అనుమతి లేకుండా బోటింగ్​.. రిసార్ట్​పై కేసు నమోదు

Vikarabad | అనుమతి లేకుండా బోటింగ్​.. రిసార్ట్​పై కేసు నమోదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikarabad | అనుమతులు లేకుండా బోటింగ్​ నిర్వహిస్తూ.. ఇద్దరి మృతికి కారణమైన రిసార్ట్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్​ మండలంలో సర్పన్​పల్లి ప్రాజెక్ట్​ ఉంది. ప్రాజెక్ట్​ సమీపంలో వెల్డర్‌నెస్‌ రిసార్ట్‌ (Wilderness Resort) నిర్వహిస్తున్నారు. అయితే రిసార్ట్​ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా బోటింగ్​(Boating) చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బోటింగ్‌కు వెళ్లి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారి మృతికి రిసార్ట్‌ యాజమాన్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.

Vikarabad | విహార యాత్రకు వెళ్లి..

హైదరాబాద్​కు చెందిన రిటా కుమారి(55), పూనమ్​ సింగ్​ (56) దాదాపు పది మందితో శనివారం వికారాబాద్(Vikarabad) మండలం సర్పన్‌పల్లి వద్ద గల వెల్డర్‌నెస్‌ రిసార్ట్‌కు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ బోటింగ్​ సౌకర్యం ఉండడంతో వీరు ఇద్దరు పిల్లలతో కలిసి బోటింగ్​కు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు పర్యాటకుల బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో రిటాకుమారి, పూనమ్​ సింగ్​ మృతి చెందగా.. ఇద్దరు చిన్నారులను స్థానికులు కాపాడారు.

Vikarabad | అనుమతులు లేకుండానే నిర్వహణ

ఎలాంటి అనుమతులు లేకుండా ది వైల్డర్‌ నెస్‌ రిసార్ట్‌ నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా బోటింగ్​ కూడా పర్మిషన్​ లేకుండానే నిర్వహిస్తుండడం గమనార్హం. టూరిస్టులకు లైఫ్‌ జాకెట్లు కూడా ఇవ్వకుండా బోటింగ్​ చేయిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇరిగేషన్​ ప్రాజెక్ట్​(Irrigation Project)లో ప్రైవేట్​ రిసార్ట్​ నిర్వాహకులు బోటింగ్​ నిర్వహిస్తున్నా ఇన్ని రోజులు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయినా కూడా బోటింగ్​ అలాగే కొనసాగించడం గమనార్హం. కాగా.. సదరు రిస్టార్ట్​ను సైతం ఇరిగేషన్ భూమిలో కట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Vikarabad | నిబంధనలు గాలికి..

హైదరాబాద్​(Hyderabad) నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతో శివారు ప్రాంతాల్లో అనేక రిసార్టులు ఏర్పాటు చేస్తున్నారు. నగరవాసులు వారాంతాలు, సెలవు దినాల్లో సేద తీరడానికి రిసార్టులకు వెళ్తున్నారు. అయితే చాలా రిసార్టులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. పలు రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్నింట్లో డ్రగ్స్​ పార్టీలు, రేవ్​ పార్టీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Read all the Latest News on Aksharatoday.in