HomeUncategorizedBoat Capsized | నడి సంద్రంలో మునిగిన రెండు నావలు.. 193 మంది దుర్మరణం!

Boat Capsized | నడి సంద్రంలో మునిగిన రెండు నావలు.. 193 మంది దుర్మరణం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boat Capsized | నడి సంద్రంలో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు నావలు నట్టేట మునిగి వందల మంది ప్రాణాలను హరించాయి. వందల మంది గల్లంతయ్యారు.

193 మంది ప్రయాణికులను బలి తీసుకున్న ఈ ఘటనలు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (Democratic Republic of the Congo)లోని వాయువ్య ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.

Boat Capsized | ఈక్వెటార్ ప్రావిన్స్‌కు..

ఈక్వెటార్ (Ecuador)​ ప్రావిన్స్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బుధవారం (సెప్టెంబరు 10), గురువారం (సెప్టెంబరు 11) ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈక్వెటార్​ ప్రావిన్స్​లోని లుకోలెలా భూభాగం నుంచి గురువారం సాయంత్రం సుమారు 500 మందితో ఓ భారీ పడవ బయలుదేరింది. మార్గమధ్యలో ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నీ కీలకాలు వ్యాపించి ఓడ బోల్తా పడింది.

ఈ దుర్ఘటనలో 107 మంది మరణించినట్లు కాంగో మంత్రిత్వ శాఖ ministry వెల్లడించింది. మరో 209 మందిని రక్షించినట్లు ప్రకటించింది.

మలాంగే గ్రామానికి చెందిన మరో ఓడ సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఈ శాఖ నివేదిక ప్రకారం 146 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.

బుధవారం బసాన్‌కుసు ప్రాంతంలో మోటారుతో నడిచే ఓడ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 86 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.