అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BMB Company | జిల్లా ప్రజలను బీఎంబీ ఆన్లైన్ కంపెనీ (BMB Online Company) నిండా ముంచింది. బీఎంబీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రజలకు డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు చెందిన వేల మంది బీఎంబీ ఆన్లైన్ కంపెనీలో రూ. 2వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీ డబ్బులు మీకు రావాలంటే మరికొంత డబ్బు చెల్లించాలని రెండు రోజుల నుంచి డిమాండ్ చేస్తూ సదరు కంపెనీ ముక్కుపిండి వసూలు చేసిందని బాధితులు పేర్కొంటున్నారు.
BMB Company | ఇంగ్లాండ్ కంపెనీగా ప్రచారం
బీఎంబీ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన కంపెనీగా ప్రజల్లో ప్రచారం చేసుకుంది. సదరు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 53 దేశాలలో కొనసాగుతుందని కొందరు కంపెనీ ఏజెంట్లు (company agents) ప్రజల్లో విశ్వాసం కల్పించారు. కొన్ని మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఇన్వెస్ట్ చేశారని ఏజెంట్లు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కలుపుకొని 3 లక్షలకు పైగా బీఎంబీ ఆన్లైన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని సమాచారం.
BMB Company | కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందంటూ..
దేశంలో ఈ కంపెనీ ఆన్లైన్ బిజినెస్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం (central government) అన్ని అనుమతులు ఇచ్చినట్లు ప్రతినిధులు ప్రచారం చేశారు. 2025 నుంచి 2030 వరకు లీగల్‌గా ఆన్లైన్ బిజినెస్ (online business legally) చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లభించిందని ప్రతినిధులు ప్రజలను నమ్మించి మోసంచేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫొటోలను యాప్‌లలో వేసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
BMB Company | బీఎంబీ పేరుతో జిల్లా కేంద్రంలో కార్యాలయం..
బీఎంబీ ఆన్లైన్ కంపెనీ పేరుతో జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో కెనరా బ్యాంక్ పక్కన ఓ కార్యాలయాన్ని గత రెండు నెలల క్రితం నెలకొల్పారు. ఈ కార్యాలయానికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. ఇలా ప్రతిరోజు పేద, మధ్యతరగతి కుటుంబానికి (poor and middle-class families) చెందిన ప్రజలు అధిక డబ్బులు వస్తాయని ఆశపడి అప్పుచేసి మరి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. అలని (phone number+44 7394592440 ) అనే మహిళ ఇంగ్లాండ్‌కు చెందిన మహిళగా ప్రచారం చేసుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రజలతో వాట్సాప్‌లో గ్రూప్‌ను క్రియేట్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నారు.
ఆమెకు నిజామాబాద్ జిల్లా (Nizamabad district) ఎడపల్లి మండలానికి చెందిన శివ, ఆయనతోపాటు జిల్లా కేంద్రంలోని బురుడు గల్లీకి చెందిన కొత్తపేట చంద్రశేఖర్‌ను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో శివ, చంద్రశేఖర్ లు కలిసి ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వేలమంది ఈ కంపెనీలలో జాయిన్ అయ్యారు. ఏర్పాటుచేసిన మొదటగా డబ్బులు వస్తున్నట్లు నమ్మించారు. రూ.కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన అనంతరం మూడు వారాల నుంచి డబ్బులు ఇవ్వడం ఆపేశారు.
BMB Company | స్లాబ్‌ల వారీగా ఇన్వెస్ట్మెంట్..
కంపెనీ ఏర్పాటు చేసుకున్న యాప్‌లో స్లాబులవారీగా ప్రజలకు తగినంత స్థోమతను బట్టి డబ్బులను ఇన్వెస్ట్ చేసుకున్నారు. కంపెనీ ఏర్పాటు చేసిన స్లాబ్‌లో వీఐపీ ఒకటి నుంచి వీఐపీ తొమ్మిది వరకు స్లాబ్‌లుగా కేటాయించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు అధిక డబ్బులు వస్తున్నాయని ఆశతో అప్పు చేసి వివిధ గ్రూపులలో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. తమకు లాభం ఇవ్వకపోయినా పర్వాలేదు తాము కట్టిన డబ్బులు తమకు చెల్లిస్తే బాగుంటుందని ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రజలు వాపోతున్నారు.
BMB Company | పోలీసుల అదుపులో నిర్వాహకులు..
బాధితుల ఫిర్యాదులో పోలీసులు సంస్థ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన పోలీసు అధికారులు జిల్లా కేంద్రంలోని బీఎంబీ ఆన్లైన్ కార్యాలయంపై (BMB Online office) శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇక్కడి నుంచి ఆన్లైన్ కంపెనీని ఆపరేట్ చేస్తున్న కొంతమంది ప్రతినిధులను క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కంపెనీకి సంబంధించిన వివరాలు కంపెనీ ఎక్కడ మొదలైంది మన జిల్లాలో రాష్ట్రంలో ఎవరు ముఖ్యపాత్ర పోషిస్తున్నానని ఆరా తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు చూపిస్తున్న అనుమతి పత్రాన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు. విచారణలో ఏం తేలుతుందోనని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.
