ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​America Colleges | అమెరికా కాలేజీల్లో బ్లూ బుక్స్​.. ఎందుకో తెలుసా?

    America Colleges | అమెరికా కాలేజీల్లో బ్లూ బుక్స్​.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:America Colleges | అమెరికాలోని పలు కాలేజీలు మళ్లీ బ్లూ బుక్స్(Blue Books)​ తీసుకు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతికత రోజు రోజుకు పెరిగిపోతుంది. పాఠశాల విద్యార్థుల (School students) నుంచి మొదలు పెడితే పీహెచ్​డీ స్కాలర్స్​ వరకు అందరూ ఇంటర్​నెట్ వినియోగిస్తున్నారు. అసైన్​మెంట్లు, ఇతర ప్రాజెక్ట్​ వర్క్​ల కోసం పాఠశాల విద్యార్థులు ఇంటర్​నెట్​(Internet) ఆశ్రయిస్తున్నారు. పలువురు పీహెచ్​డీ స్కాలర్స్​ కూడా తమ థీసిస్​ను నెట్​లో నుంచి కాపీ కొడతారనే ఆరోపణలు ఉన్నాయి.

    America Colleges | ఏఐ యుగంలో..

    ప్రస్తుతం మనం ఏఐ(AI) యుగంలో ఉన్నాం. గతంలో విద్యార్థులు అసైన్​మెంట్​ కాపీ చేయాలన్నా.. విద్యార్థులు ఆన్​లైన్లో శోధించాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(Artificial Intelligence)కు ఇన్​పుట్​ ఇస్తే చాలు. అదే అసైన్​మెంట్​ వర్క్​ రెడీ చేసి పెడుతోంది. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ క్రమంలో అమెరికాలోని పలు కాలేజీలు మళ్లీ బ్లూ బుక్స్​ తీసుకు వస్తున్నాయి.

    America Colleges | మోసం చేయకుండా ఉండటానికి..

    ఏఐ వినియోగం పెరిగిన తర్వాత అసైన్​మెంట్​, ప్రాజెక్ట్​ల కోసం విద్యార్థులు దానిపైనే ఆధార పడుతున్నారు. ఏఐ సాయంతో విద్యార్థులు (Students) చీటింగ్​కు పాల్పడుతున్నట్లు గుర్తించిన యూనివర్సిటీలు(Universities of America) మళ్లీ బ్లూ బుక్స్​ తీసుకు వస్తున్నాయి. ఇందులోనే అసైన్​మెంట్లు రాయించడం, పరీక్షల నిర్వహణ చేపట్టనున్నాయి. దీంతో విద్యార్థుల చేతి రాత కూడా మెరుగ​వుతుందని ప్రొఫెసర్లు భావిస్తున్నారు.

    America Colleges | బ్లూ బుక్​ అంటే..

    విద్యార్థులు తమ హోంవర్క్ చేయడానికి కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారని పలువురు ప్రొఫెసర్లు(Professors) పేర్కొన్నారు. దీంతోనే బ్లూ బుక్స్​ తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా బ్లూ బుక్స్​ అనేవి సరళమైన, స్టేపుల్ చేయబడిన పరీక్షా బుక్‌లెట్‌లు. పైన నీలిరంగు అట్టలతో ఉండటం మూలంగా వీటిని బ్లూ బుక్స్​ అంటారు. 20 శతాబ్దం ప్రారంభంలో అమెరికా(America)లో వీటిని ప్రవేశ పెట్టారు. పరీక్షల నిర్వహణ, అసైన్​మెంట్, హోం వర్క్​కు వీటినే ఉపయోగించేవారు. అయితే సాంకేతికత ఇటీవల హోం వర్కులు కూడా డిజిటల్​ విధానంలో చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులు ఏఐ సాయంతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన యూనివర్సిటీలు మళ్లీ బ్లూ బుక్స్​ తీసుకువస్తున్నాయి.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...