ePaper
More
    HomeతెలంగాణBlood Test | దేశంలోనే తొలిసారి.. సూది గుచ్చ‌కుండానే బ్ల‌డ్ టెస్ట్‌

    Blood Test | దేశంలోనే తొలిసారి.. సూది గుచ్చ‌కుండానే బ్ల‌డ్ టెస్ట్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Blood Test | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వ‌చ్చాక జరుగుతున్న అద్భుతాలు అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా తాజాగా ఏఐ ద్వారా మరో అరుదైన అద్భుతాన్ని సాధించారు.

    సూదితో పొడవకుండానే రక్త పరీక్షలు నిర్వహించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంతేకాక దీన్ని దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో (Niloufer hospital) అధికారికంగా ప్రారంభించారు. ఇకపై రక్త పరీక్ష చేయించుకోవాలంటే చేతికి సూది పొడవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు రూపుదిద్దిన కొత్త టెక్నాలజీ “అమృత్ స్వస్థ్ భారత్”(Amrit Swasthya Bharat) టూల్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

    Blood Test | అద్భుతం..

    కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే హెల్త్ స్కానింగ్ (Health Scanning) పరికరం ద్వారా మన ముఖాన్ని (Face) స్కాన్ చేసి, కొన్ని క్షణాల్లోనే బ్లడ్ టెస్ట్(Blood Test)తో పాటు పలు ఆరోగ్య వివరాలను అందిస్తుంది. దీని కోసం ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ (ఫొటో ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ) సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని తొలిసారి నిలోఫర్ ఆస్పత్రిలో ప్రవేశపెట్టారు. ఈ ప‌రిక‌రం ద్వారా ఓ ప్రత్యేకమైన కాంతిని మన ముఖం మీద ప్రసరింపజేస్తారు. ఈ కాంతి మన శరీరంలోని రక్తప్రసరణ, ఆక్సిజన్ పరిమాణం వంటి కీలక అంశాలను గుర్తించగలదు. తేలికపాటి స్కానింగ్‌తోనే హార్ట్ రేట్, హీమోగ్లోబిన్, స్ట్రెస్ లెవెల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్ వంటి ప్యారామీటర్లను గుర్తించడంలో ఇది సులభంగా పనిచేస్తుంది.

    సంప్రదాయ రక్తపరీక్షలకు సమయం పట్టడంతో పాటు, రిపోర్టుల (Reports) కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త పరికరంతో ఆ ఇబ్బందులకు తెరపడనుంది. ఈ పీపీజీ పరికరం పనితీరు చాలా సులభం. ఎల్ఈడీ ట్రైపోడ్‌(LED Tripod)కు అమర్చిన ఈ పరికరంతో అనుసంధానించిన సెల్ఫోన్ స్క్రీన్ వైపు రోగులు 30 నుంచి 40 సెకన్ల పాటు చూస్తే చాలు. వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా పరికరం కేవలం నిమిషంలోపే అనేక ఆరోగ్య వివరాలను అందిస్తుంది.

    రక్తపోటు (బీపీ), రక్తంలో ఆక్సిజన్ స్థాయులు (ఎసీపీఓ2), హార్ట్ బీట్, శ్వాసక్రియ రేటు, హెచ్ఐరివీ (హార్ట్ రేట్ వేరియబిలిటీ), ఒత్తిడి స్థాయులు, హిమోగ్లోబిన్ శాతం, పల్స్ రెస్పిరేటరీ కోషెంట్, సింపథిటిక్, పారాసింపథిటిక్ నాడీ వ్యవస్థల పనితీరు వంటి అనేక కీలక ఆరోగ్య సూచికలను ఈ పరికరం విశ్లేషించి అందిస్తుంది. పిల్లలు, వృద్ధులు, బలహీన శరీరులైన వారికీ అధిక ప్రయోజనం ఉంటుంది.

    Latest articles

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    More like this