7
అక్షరటుడే, బాన్సువాడ: Sub-Collector Kiranmayi | రక్తదానం ప్రాణదానంతో సమానమని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రక్తదానం చేసిన ఏఎస్ఆర్ ఫౌండేషన్ (ASR Foundation) సభ్యులకు బుధవారం సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
గర్భిణుల కోసం రక్తదానం చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలు అవుతారని పేర్కొన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండర్ సంతోష్, జిల్లా అధ్యక్షుడు బంగారు రవి, బేజుగం సంతోష్, దాత్రిక్ విఠల్, సురేష్, మహేందర్, సాయిలు, అనిల్ పాల్గొన్నారు.
1 comment
[…] బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), జిల్లా డీఎస్వో వెంకటేశ్వర్లు, […]
Comments are closed.