అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వరంలో శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో హుతాత్మా దివస్ (Hutatma Diwas) నిర్వహించారు. ఇందులో భాగంగా స్నేహ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం కోసం ప్రాణాలర్పించిన కోఠారి బ్రదర్స్‌తో పాటు మరెందరో ప్రాణాలు అర్పించారని వక్తలు తెలిపారు. వారిని గుర్తు చేసుకునేందుకు హుతాత్మ దివస్ నిర్వహించినట్లు వివరించారు. రక్తదాన శిబిరంలో (blood donation camp) పలువురు స్వచ్ఛందంగా 52 యూనిట్ల రక్తం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా త్రికండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, జిల్లా గోరక్షక్ తులసిదాస్, హరిబాబు, ఎల్లారెడ్డి బజరంగ్ దళ్ సంయోజక్ భరత్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్, పట్టెం కిషన్, రాహుల్, గాండ్ల రాజు, క్రాంతి కుమార్, ప్రకాష్, అఖిల్, యాదగిరి, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

