అక్షరటుడే, కామారెడ్డి: Blood Donation Camp | ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 75వ బర్త్‌డేను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipalli Venkata Ramana Reddy) బుధవారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్తదానం (Blood Donation) చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 11ఏళ్లుగా దేశానికి ప్రధానిగా, అంతకు ముందు గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి సీఎంగా ఎనలేని సేవలు చేస్తున్నారని తెలిపారు. భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని మోడీ ఆయురాగ్యాలతో నిండు నూరేళ్లు ఈ దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఆయనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త దేశ సేవలో పునరంకితం కావాలని కోరారు. ప్రధాని మోడీ జన్మదిన (PM Modi birthday) సందర్భంగా కామారెడ్డి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి మరో ప్రాణాన్ని కాపాడటం సంతృప్తినిస్తుందన్నారు. రక్తదానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ రక్తదానం చేయటానికి ముందుకి రావాలని విజ్ఞప్తి చేశారు.