అక్షరటుడే, ఎల్లారెడ్డి : Blood Donation Camp | పట్టణంలో రక్తదాన శిబిరం విజయవంతమైందని ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్(Jamil Haimad) పేర్కొన్నారు.
మైనారిటీ ఫంక్షన్హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మిలాద్ ఉన్ నబీ(Milad-un-Nabi) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు, జమీల్ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు. అపోహలను విడనాడి రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన నీతి న్యాయం ధర్మం సమాజ సేవ అనే సూత్రాలను నిజజీవితంలో పాటించి సన్మార్గంలో నడవాలని అన్నారు.
సేవా మార్గంతోనే మానవ జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం వెల్ఫేర్ కమిటీ(Muslim Welfare Committee) అధ్యక్షులు గయాజుద్దీన్, కమిటీ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు ముక్రం, సయ్యద్ మీర్,అజీజ్ రెహమాన్,అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.