అక్షరటుడే, ఇందూరు : Blood Donation Camp | వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శనివారం రక్తదానం శిబిరం నిర్వహించారు. హుతాత్మత దివస్‌ను పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సొసైటీ (Red Cross Society) ఆధ్వర్యంలో వీహెచ్‌పీ కార్యాలయం (VHP Office)లో శనివారం రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్దళ్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో రామజన్మ భూమి కోసం ఎంతోమంది కర సేవకులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను గుర్తు చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం (Blood Donation Camp) నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహకార దర్శి ధాత్రిక రమేష్, జిల్లా సేవాప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ అఖిల్, నగర సాహ సంయోజఖ్ అఖిలేష్, బండి వెంకటేష్, సోను, సుధీర్, రాహుల్, బోయిన్పల్లి కృష్ణ, నితిన్, సంతోష్, గణేష్, సంపత్, రెడ్ క్రాస్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
