Homeజిల్లాలుకామారెడ్డిSBI | ఎస్​బీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

SBI | ఎస్​బీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, రెడ్​క్రాస్​ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 101 యూనిట్ల రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఆర్ఎంవో సుజాత (RMO Sujatha) మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎస్​బీఐ బాన్సువాడ శాఖను (Sbi Banswada) అభినందించారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్ సొసైటీ (Red Cross Society) మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ సునీల్, ఫీల్డ్ ఆఫీసర్ శంకర్ గౌడ్, భాస్కర్ రావు, గోపి, బ్లడ్ బ్యాంక్ పీఆర్వో ఆనంద్, ల్యాబ్ టెక్నీషియన్లు రాఘవేందర్, ఎబినైజార్, సూర్యకాంత్, శ్రీనివాస్, బ్యాంక్ అధికారులు శ్రీనివాస్ చౌదరి, మహిపాల్, కృష్ణ స్వామి, స్వామి, మోహన్ రావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News