అక్షరటుడే, బాన్సువాడ: Blood Donation | బాన్సువాడ ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో (Banswada SSL Degree College) మేరా యువ భారత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న నేషనల్ వాలంటీర్ రక్తదానం డే సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా రక్తదానం (blood donation) గొప్పదన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరికి పునర్జన్మ కల్పించవచ్చారు. రోడ్డు ప్రమాదాలు, సిజేరియన్ డెలివరీలు వంటి సందర్భాల్లో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అయితే యువత రక్తదానం పట్ల పెద్దగా ముందుకు రాకపోవడం విచారకరమని తెలిపారు.
మానవ శరీరంలో 120 రోజులకు ఎర్ర రక్త కణాలు (red blood cells) సహజంగా చనిపోతాయని చెప్పారు. వాటిని దానం చేస్తే మరొకరి ప్రాణాన్ని రక్షించవచ్చని వివరించారు. యువతరం రక్తదానంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ సుభాష్ గౌడ్, లక్ష్మణ్, అంజయ్య, నాగరాజు, బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.