అక్షరటుడే, ఇందూరు: Battu Raghavender Campaign | మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల (Municipal Corporation Elections) ప్రచారంలో నగరంలోని 44 డివిజన్ బీజేపీ అభ్యర్థి బట్టు రాఘవేందర్ దూసుకుపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు.
రాఘవేందర్ గురువారం ఉదయం డివిజన్లోని పలు కాలనీల్లో ప్రచారం చేశారు. అనుచరులతో కలిసి ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే.. డివిజన్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లోని ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసి పెడతానని చెప్పారు.
Battu Raghavender Campaign | కేంద్ర పథకాలను వివరిస్తూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఓటర్లకు చెబుతున్నారు. మహిళలకు రూ.2,500, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ (Job Calendar) ఊసే లేకుండా పోయిందన్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు ఆయా కాలనీల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు.
