అక్షరటుడే, వెబ్డెస్క్ :Switzerland | స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్(Alps) పర్వతాల్లో ఘోరమైన మంచు పతనం వలన అందమైన స్విస్ గ్రామం కొద్ది సెకన్లలోనే భూస్థాపితం అయింది.
సాధారణంగా స్విస్ (Swiss)పేరు వినగానే అందమైన ఆల్ప్స్ పర్వతాలు, ప్రకృతి సోయగాలు మన కళ్లముందు కదలాడుతాయి. అయితే, తాజాగా అక్కడ ఘోర విపత్తు సంభవించడంతో ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని వాలిస్ ప్రాంతంలో మంచు పతనం జరిగింది. బిలర్చ్ గ్లేసియర్ (Bilarch Glacier) కూలిపోయింది. ఈ విపత్తు కారణంగా టన్నుల కొద్ది మంచు, రాళ్లు పర్వత శ్రేణుల నుంచి లోయలోకి దూసుకొచ్చాయి. ఈ భారీ మంచు చరియలు బ్లాటెన్ అనే చిన్న గ్రామాన్ని (Blatten village) పూర్తిగా ధ్వంసం చేశాయి.
Switzerland | ఊహించని విపత్తు…
ఈ నెల 28న జరిగిన ఈ విపత్తుకు ముందు 19వ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది నివాసితులు, పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ, 64 ఏళ్ల వృద్ధుడు కొండచరియల కింద చిక్కుకుని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు డ్రోన్లు Drones, జాగిలాలతో గాలింపు కొనసాగుతోంది. అయితే, శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే హిమానీనదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు.
దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లోంజా నది(Lonza River)కి అడ్డుకట్ట పడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్, కిప్పెల్ మునిసిపాలిటీలలోని భవనాలను కూడా ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు Scientists భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి. ఈ విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తు చేస్తోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
https://www.instagram.com/reel/DKRLVzUI4Ri/?utm_source=ig_web_copy_link