HomeUncategorizedOperation Sindoor | ఆ ప్రాంతాల్లో బ్లాక్​ అవుట్​..

Operation Sindoor | ఆ ప్రాంతాల్లో బ్లాక్​ అవుట్​..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor : పహల్ గామ్ ​ ఉగ్రదాడి (Pahalgaon terror attack)కి ప్రతీకార చర్యగా.. భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్​ ఏమిచేయాలో పాలుపోని స్థితిలో జమ్మూపై డ్రోన్ల దాడికి తెగబడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది.

కాగా, ఇండియన్​ ఆర్మీ వాటిని సమర్థంగా నేలమట్టం చేసింది. వీటిలో చాలా వరకు టర్కీ, చైనాలో తయారైనవి కావడం గమనార్హం. అంతటితో ఆగకుండా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ 2.0 చేపట్టింది. పాక్​ ప్రధాన పట్టణాలపై మెరుపుదాడులు చేసి, పాకిస్తాన్ లో చైనా రూపొందించిన​ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

భారత్​ ప్రతిదాడులతో నిస్సహాయ స్థితికి చేరుకున్న పాక్​.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సరిహద్దు వెంబడి మళ్లీ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లను ప్రయోగిస్తోంది. వాటిని ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటోంది. దీనికి తోడు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, హోషియార్‌పూర్‌ Ferozepur, Pathankot, Amritsar, Hoshiarpur తో సహా పలు ప్రాంతాలను బ్లాక్‌అవుట్ చేసింది. సైరన్లు యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

పాక్​ మళ్లీ దాడులు చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ రాత్రికి ఆపరేషన్​ సిందూర్​ 3.0 ఉంటుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

Must Read
Related News