అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Black Sunday | ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మార్కెట్లో విపరీతమైన ఊహాగానాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎస్టీటీని పెంచింది. అయితే ఈ నిర్ణయం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. దీనికితోడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి గణనీయమైన చర్యలు లేకపోవడంతో పెట్టుబడిదారులు మరింత నిరాశకు గురయ్యారు. దీంతో బడ్జెట్ ఆదివారం స్టాక్ మార్కెట్లో బ్లాక్ సండేగా (Black Sunday) నిలిచిపోయింది.
ఆదివారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 119 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 338 పాయింట్లు పెరిగింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఎస్టీటీని పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్ సెల్లాఫ్‌కు గురయ్యింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ నిఫ్టీ 869 పాయింట్లు క్షీణించాయి. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కాస్త తేరుకున్నా భారీ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,546 పాయింట్ల నష్టంతో 80,722 వద్ద, నిఫ్టీ 495 పాయింట్ల నష్టంతో 24,825 వద్ద స్థిరపడ్డాయి.
Black Sunday | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,759 కంపెనీలు లాభపడగా 2,375 స్టాక్స్ నష్టపోయాయి. 175 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 68 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 253 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 16 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 13 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ 9.39 లక్షల కోట్ల మేర పడిపోయింది.
Black Sunday | అన్ని రంగాలలో సెల్లాఫ్..
బీఎస్ఈలో ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ ఇండెక్స్ 0.43 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్ 5.60 శాతం పడిపోగా.. క్యాపిటల్ గూడ్స్ 3.02 శాతం, డిఫెన్స్ 4.62 శాతం, పీఎస్‌యూ 4.17 శాతం, మెటల్ 3.85 శాతం, కమోడిటీ 3.35 శాతం, యుటిలిటీ 2.98 శాతం, ఎనర్జీ 3.14 శాతం, ఇన్ఫ్రా 2.95 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.77 శాతం
Black Sunday | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో ఉండగా.. 26 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 1.92 శాతం, ఇన్ఫోసిస్ 1.17 శాతం, సన్‌ఫార్మా 0.95 శాతం, టైటాన్ 0.33 శాతం లాభపడ్డాయి.
Black Sunday | Top losers..
ఎస్బీఐ 5.61 శాతం, అదానిపోర్ట్స్ 5.53 శాతం, బీఈఎల్ 5.36 శాతం, ఐటీసీ 3.91 శాతం, టాటా స్టీల్ 3.88 శాతం నష్టపోయాయి.