Homeబిజినెస్​Stock Market | బ్లాక్‌ ఫ్రైడే.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | బ్లాక్‌ ఫ్రైడే.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | పశ్చిమాసియాలో యుద్ధ భయాలతో స్టాక్‌ మార్కెట్లు(Stock markets) ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయిల్‌(Israel) ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో మరో బ్లాక్‌ ఫ్రైడే నమోదయ్యింది.

ఇరాన్‌(Iran) అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయిల్‌ ఆ దేశంపై భీకర దాడులకు పాల్పడింది.గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయిల్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌(Air strikes) ప్రారంభించింది. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ ప్లాంట్‌, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్‌ పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌ డ్రోన్‌(Drone) దాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై పడింది. గ్లోబల్‌ మార్కెట్ల(Global markets)న్నీ నెగెటివ్‌గానే ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇజ్రాయిల్‌ దాడులకు ముందు పాజిటివ్‌గా ఉన్న వాల్‌స్ట్రీట్‌(Wallstreet).. దాడుల తర్వాత కుదుపునకు లోనయ్యింది. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌(Dow Jones Futures) 1.35 శాతం నష్టంతో కదలాడుతోంది. ఆసియాలోని అన్ని ప్రధాన మార్కెట్లూ శుక్రవారం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఇరాన్‌ ప్రతిస్పందనతో మరింత కుంగుబాటుకు లోనయ్యాయి. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్పంగా కోలుకున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో కోస్పీ(Kospi) 1.20 శాతం నష్టంతో ఉండగా.. నిక్కీ 1.10 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.97 శాతం, హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.94 శాతం, షాంఘై 0.80 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.47 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Stock Market | మన మార్కెట్లలోనూ భారీ నష్టాలు..

మిడిల్‌ ఈస్ట్‌(MIddle east)లో నెలకొన్న యుద్ధ భయాలతో గ్లోబల్‌ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర పది శాతానికిపైగా పెరగడంతో శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌(Sensex) ఒక దశలో ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో ఒక శాతం నష్టంతో కదలాడుతున్నాయి. అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.