ePaper
More
    HomeUncategorizedBlack box | బ్లాక్ బాక్సే కీలకం.. విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

    Black box | బ్లాక్ బాక్సే కీలకం.. విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Black box : గుజరాత్ లోని అహ్మదాబాద్​(Ahmedabad)లో జరిగిన ఘోర విమాన దుర్ఘటన(plane crash)పై దర్యాప్తు ప్రారంభమైంది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎయిరిండియా డ్రీమ్లైనర్ AI-171 డ్రీమ్‌ లైనర్‌ కుప్పకూలి పోయింది. చెట్టును ఢీకొట్టి హాస్టల్‌పై పడడంతో జరిగిన విస్ఫోటనంతో విమానంలో ఉన్న వారంతా సజీవ సమాధి అయ్యారు. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారని అధికారులు ప్రకటించారు.

    మరోవైపు, దేశాన్ని కలిచి వేసిన ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) విచారణ మొదలు పెట్టింది. ఈ విచారణలో బ్లాక్‌ బాక్స్‌ కీలకం కానుంది. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు వెల్లడి కానున్నాయి.

    Black box : సమాచారమంతా అక్కడే నిక్షిప్తం

    విమానంలో బ్లాక్‌ బాక్స్‌ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే రికార్డింగ్ డైవైజ్. ఫ్లైట్ డేటా రికార్డర్ (Flight Data Recorder – FDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (Cockpit Voice Recorder – CVR) ఇందులో ఉంటాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడం, ప్రమాదం దర్యాప్తునకు ఇది ఉపయోగపడుతుంది. విమానంలో జరిగే మొత్తం ప్రక్రియ ఇందులో రికార్డు అవుతుంది. కేవలం కాక్పిట్లో పైలెట్ల సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్లు ప్రైవేట్ గా జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమానం బయలు దేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాక ప్రతీది ఇందులో రికార్డ్ అవుతుంది.

    బ్లాక్‌ బాక్స్‌ ను తెరిచి విశ్లేషించడం ద్వారా ప్రమాద కారణాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు. బ్లాక్ బాక్స్ లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (digital flight data recorder)విమాన వేగం, భూతలం నుంచి అది ఎంత ఎత్తులో ఉంది, ఏ దిశలో ఉంది, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. పేరుకు బ్లాక్ బాక్స్ అయినా.. ఇది నారింజ రంగులో ఉంటుంది. విమానం తగలబడి పోయినా, అన్ని ప్రమాదాలను తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులోని రెండు రికార్డర్లు తీవ్రమైన వేడి, నీటి ఒత్తిడి, పేలుళ్లు వంటి పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు.

    విమానం కూలే ముందు ఏం జరిగింది? అన్నదానికి బ్లాక్ బాక్స్ నుంచి స్పష్టమైన వివరాలు తీసుకోవచ్చు. ఇందులో డేటా ఆధారంగా.. ప్రమాదానికి యాంత్రిక లోపం కారణమా? బర్డ్స్ట్రైక్ లేదా గాలిలో ఎదురైన అడ్డంకి కారణమా? లోపల ఏవైనా పేలుళ్లు సంభవించాయా? మంటలు చెలరేగాయా? పైలట్ వైఫల్యం వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. పైలెట్ MAYDAY చెప్పారా? విమానాన్ని కాపాడే ప్రయత్నం చేశారా? అన్న విషయాలన్నీ ఇందులో రికార్డవుతాయి.

    ప్రమాద సమయంలో లభించిన బ్లాక్ బాక్స్ ను డిజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో డేటాను సేకరించి, రాడార్ (radar), ATC లాగ్స్ తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి వారం వరకు పడుతుంది. గతంలో జరిగిన విమాన ప్రమాదాలను బ్లాక్‌ బాక్స్‌ సమాచారం ద్వారానే విశ్లేషించి ప్రమాదాలకు గల కారణాలను గుర్తించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...