ePaper
More
    Homeఅంతర్జాతీయంBalochistan | పాక్​ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బీఎల్​ఏ.. రెండు దాడుల్లో 39 మంది హతం..

    Balochistan | పాక్​ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బీఎల్​ఏ.. రెండు దాడుల్లో 39 మంది హతం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Balochistan | పాకిస్తాన్​ సైన్యానికి బలోచిస్తాన్​ వేర్పాటువాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాదీ దేశానికి బలూచ్​ లిబరేషన్‌ ఆర్మీ (Baloch Liberation Army) నిద్ర పట్టనివ్వడం లేదు. పాక్​ సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. రెండు రోజుల్లో ఏకంగా 39 మంది సైనికులు బీఎల్​ఏ దాడుల్లో మృతి చెందారు.

    Balochistan | బస్సుపై దాడి

    కరాచీ నుండి క్వెట్టాకు వెళ్తున్న సైనిక బస్సుపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది పాకిస్తానీ సైనికులు (Pakistani Soldiers) చనిపోయారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) రెండు సంస్థలు పాక్​ సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఈ సంస్థల దాడుల్లో 39 మంది సైనికులు చనిపోయారు. బీఎల్​ఎఫ్​ కలాట్, ఝౌలలో కూడా దాడులు చేయగా పది మంది చనిపోయారు.

    READ ALSO  Pakistan | పాక్​లోనే మసూద్​ అజార్​.. దాయాదీ చెప్పేవన్నీ అబద్దాలేనని మరోసారి తేలిపోయింది..!

    Balochistan | వరుస దాడులు

    క్వెట్టాలోని హజర్ గంజి (Quetta Hajar Gunji) ప్రాంతంలో బీఎల్​ఏ సభ్యులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం కలాత్‌లోని ఖజినా (Kalat Khajina) ప్రాంతంలో మరో ఘటనలో నలుగురు సైనికులను చంపినట్లు బీఎల్​ఏ ప్రకటించింది. బుధవారం గుజ్రోకొర్‌ ప్రాంతంలో దాడు చేసి ఆరుగురు సైనికులను హతమార్చినట్లు పేర్కొంది.

    బలూచిస్తాన్​పై పాక్​ ఆక్రమణలకు వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నట్లు బీఎల్​ఏ ప్రతినిధి జియంద్ బలూచ్ (BLA Spokesperson Ziand Baloch) తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ వరకు బలోచ్‌ రెబల్స్‌ మొత్తం 286 దాడులు చేశారు. ఈ దాడుల్లో 700 మంది వరకు మృతి చెందారు. గతంలో పలు ప్రాంతాలను కూడా బీఎల్​ఏ స్వాధీనం చేసుకుంది.

    READ ALSO  Iraq | షాపింగ్​ మాల్​లో అగ్ని ప్రమాదం.. 60 మంది సజీవ దహనం

    Latest articles

    Bihar | మరో దారుణం.. కోపంతో భర్త నాలుక కొరికి మింగేసిన భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత...

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది....

    More like this