158
అక్షరటుడే, ఇందూరు : BJYM Nizamabad | నిజామాబాద్ (Nizamabad) పేరును ఇందూరుగా మార్చాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
BJYM Nizamabad | నిజాం నిరంకుశ పాలన..
ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్ (Palnati Karthik) మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు గుర్తుగా ఉన్న నిజామాబాద్ జిల్లా పేరును తొలగించి ఇందూర్ జిల్లాగా (Indur District) మార్చాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో 25వ డివిజన్ నాయకులు జగదీష్, నిరంజన్ చరణ్, రాకేష్, సంతోష్, యోగేష్, సాయి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.