అక్షరటుడే, బాన్సువాడ : Banswada | కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ (Banswada) పట్టణంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల (Central Govt Schemes) గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజలను మోసం చేస్తోందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ కన్వీనర్ చిదరు సాయిలు, మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చీకట్ల రాజు, అనిల్, గంగారాం, తోట శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.