అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BC Declaration | బీసీ రిజర్వేషన్‌పై (BC Reservation) తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ (Cooperative Union) ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan reddy) విమర్శించారు.
పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాటమీద కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే.. సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం (Central Government) రిజర్వేషన్లకు మోకాలడ్డు పెట్టడం సరికాదని స్పష్టం చేశారు.
BC Declaration | లోపల ఒకలాగా.. బయట మరోలాగా..
అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లును స్వాగతిస్తున్నామని చెబుతున్నారని.. అదే పార్టీ ఎంపీలు మాత్రం బీసీ బిల్లు నుంచి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని తెలుపలేదని.. బీసీల్లోకి వచ్చే అన్ని వర్గాలకు ఈ బిల్లు అమలవుతుందని మాత్రమే పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ఆ మాత్రం కూడా తెలియకుండా మైనారిటీలను బీసీ బిల్లు నుండి తొలగిస్తే ఆమోదం తెలుపుతామని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పడం చూస్తుంటే వారి అవివేకం బయటపడుతోందన్నారు.
BC Declaration | పీఎం మోదీ మెప్పు కోసమే..
కేవలం మోదీ మెప్పు కోసం మాత్రమే రాష్ట్రంలో బీసీ బిడ్డలకు బండి సంజయ్ (MP Bandi Sanjay), కిషన్ రెడ్డి (Mp Kishan Reddy) అన్యాయం చేస్తున్నారని మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి అగ్రకులానికి చెందిన వాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెబుతున్నాడన్నారు. కానీ బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎందుకు అడ్డుపడుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. అడ్డుపడడమే కాకుండా ఒక పిచ్చోడి మాదిరిగా మైనారిటీలను బీసీ బిల్లు నుండి తొలగిస్తేనే ఆమోదం తెలుపుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
BC Declaration | దేశంలో అందరికీ న్యాయం జరగాలి..
దేశంలో అందరికీ సామాన న్యాయం జరగాలని ఆలోచించే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన జరుగుతోందని మానాల స్పష్టం చేశారు. నిజంగా బీజేపీ ఎంపీలకు బీసీ బిల్లును మద్దతు తెలిపాలనుకుంటే విలేకరుల సమావేశాలు పెట్టి మద్దతు తెలుపవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈనెల 15న కామారెడ్డిలో (Kamareddy) చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Cheif Bomma), రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కామారెడ్డికి వస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న బీసీలంతా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకుని బీసీ సభను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
బీసీలకు కచ్చితంగా 42శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు యాదగిరి, భీమ్‌గల్ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తిప్పిరెడ్డి శ్రీనివాస్, లవంగ ప్రమోద్, ఈసా, అబ్దుల్ ఎజాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలు, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.