HomeతెలంగాణMLA Raja Singh | బీజేపీ కీలక నిర్ణయం.. రాజాసింగ్​ రాజీనామా ఆమోదం

MLA Raja Singh | బీజేపీ కీలక నిర్ణయం.. రాజాసింగ్​ రాజీనామా ఆమోదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Raja Singh | బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్​ లీడర్​, హిందూ టైగర్​గా పేరున్న గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ రాజీనామాను (MLA Raja Singh Resignation) ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్​(Arun Singh) ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​కు హిందుత్వవాదిగా యువతలో మంచి ఫాలోయింగ్​ ఉంది. అయితే ఆయన గత కొంత కాలంగా పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు రహస్య సమావేశాలు నిర్వహించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

MLA Raja Singh | అధ్యక్ష ఎన్నికతో..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్​ నాయకుడు రామచందర్​రావు (Bjp President Ramachandra Rao) ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్​ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. ఈ క్రమంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా నాశనం చేసే వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన జూన్​ 30న కిషన్​ రెడ్డికి (Kishan Reddy) తన రాజీనామా సమర్పించారు. తాజాగా జాతీయ అధ్యక్షుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

MLA Raja Singh | రాజాసింగ్​ అడుగులు ఎటువైపు..

రాజాసింగ్​ మొదటి నుంచి హిందుత్వవాది అయినప్పటికీ.. తన రాజకీయ జీవితాన్ని మాత్రం టీడీపీ నుంచి ప్రారంభించారు. టీడీపీ నుంచి కార్పొరేటర్​గా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. అనంతరం వరుసగా మూడుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ సిటీలో ​(Hyderabad city) ప్రతి శ్రీరామ నవమికి రాజాసింగ్​ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రకు లక్షలాది మంది తరలి వస్తారు. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి క్రేజ్​ ఉంది.

ఈ క్రమంలో పార్టీ రాజీనామా ఆమోదించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. అయితే కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లో చేరనని ఆయన ఇది వరకే ప్రకటించారు. కాగా.. గతలోనూ రాజసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తిరిగి ఆయన్ను బీజేపీ మళ్లీ పార్టీలోకి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో రాజసింగ్ కు బీజేపీ గేట్లు మూసుకుపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.