అక్షరటుడే, ఇందల్వాయి: Dinesh Kulachari | మూడురోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని బీజేపీ (BJP Nizamabad) జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. మండలంలోని గన్నారం (Gannaram), సిర్నాపల్లి (Sirnapally), జీకే తండా (GK Thanda) గ్రామాల్లో పర్యటించారు.
తక్షణసాయం కింద పలువురు బాధితులకు ఆహారం, బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీవ్రంగా నష్టపోయిన వారి వివరాలు సేకరించి అధికారులకు పంపిస్తామని తెలిపారు. భారీవర్షాలకు (Heavy rains) ఇళ్లతో పాటు, వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం వైపు నుంచి బాధితులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామన్నారు. బాధిత కుంటుంబాలకు బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సీనియర్ నాయకులు, నాయుడి రాజన్న, శ్రావణ్, సవిత, నారాయణ తదితరులున్నారు.