అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) సోమవారం ఇందూరు పర్యటనకు రానున్నారని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachary) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని శ్రీరామ గార్డెన్లో బూత్ స్థాయి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) హాజరవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇందల్వాయి (Indalwai) టోల్గేట్ వద్ద స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా శ్రీరామ గార్డెన్‌కు చేరుకుంటారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దినేష్ కులాచారి అన్నారు. ఓటు చోరీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul gandhi) అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు (National Yellow Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగోల లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మా రెడ్డి, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.