అక్షరటుడే ఇందల్వాయి: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (BJP chief Ramachandra Rao) జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఇందల్వాయి టోల్‌ప్లాజా (Indalwai Toll Plaza) వద్ద ఎంపీ అర్వింద్ (MP Arvind), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రామచంద్రరావుకు ఘనస్వాగతం పలికాయి. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కేపీ రెడ్డి, నాయుడు రాజన్న, మోహన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
BJP Nizamabad | నగరంలోని శ్రీరామ గార్డెన్లో..
నగరంలోని శ్రీరామ గార్డెన్లో (Srirama Garden) బీజేపీ శ్రేణులతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పదాధికారులతో ఆయన మాట్లాడనున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలపై (Local Body Elections) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.