25
అక్షరటుడే, ఇందల్వాయి: Dinesh Kulachari | బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ (Dinesh Kulachari ) కుటుంబాన్ని శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (BJP State President Ram Chander Rao) పరామర్శించారు. ఈనెల 17వ తేదీన జిల్లా అధ్యక్షుడు దినేష్ చిన్ననాన్న కులాచారి మోహన్ రావు మరణించారు.
సమాచారం తెలుసుకున్న రాంచందర్రావు శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామానికి వచ్చారు. అక్కడ దినేష్ కులాచారి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఇలాంటి సమయంలో మనోధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.