అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సోమార్‌పేట్‌లో (Somarpet) ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి రాజు ఇంటిపై దాడి ఘటనలో బాధితులను సోమవారం సాయంత్రం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఎల్లారెడ్డిలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి (Paidi Yellareddy), బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు వెళ్లారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Yellareddy | అమానుష చర్య..
పాత కక్షలతో ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్‌తో దాడిచేయడం అమానుష చర్య అని పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు మహిళలతో పాటు ఓ బాలుడు గాయపడడం కలిచివేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దతుతో ఆయన అనుచరులు పట్టపగలే ప్రాణాలు తీస్తూ రౌడీయిజం చేస్తుండడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి కుటుంబంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట బీజేపీ సీనియర్ నాయకులు బాల్ కిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ తదితరులున్నారు.