అక్షరటుడే, ఇందూరు : BJP Religious Politics Allegation | బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లను దండుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్‌లో గల సన్‌ఫ్లవర్ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
BJP Religious Politics Allegation | ప్రతిఒక్కరూ ఓటు వేయాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పీసీసీ చీఫ్ సూచించారు. తొలి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ప్రజలంతా బయటకి వచ్చి ఓట్లు వేయాలని కోరారు.
మేయర్ పీఠం కాంగ్రెస్‌దే..
నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation)లో ఈసారి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. కొందరికి ఓటింగ్ స్లిప్‌లు రాలేవని తమ దృష్టికి వచ్చిందని 16 రకాల ఐడీ కార్డులతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చని ఆయన అన్నారు.
8.25 శాతం ఓటింగ్ నమోదు..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో నగరపాలక సంస్థతోపాటు మూడు మున్సిపాలిటీలో కలిపి మొత్తం 8.25 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్మూర్‌లో 11.05 శాతం, బోధనలో 14.24 శాతం, భీమ్‌గల్‌లో 9.38 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) వినాయక్ నగర్లో 19వ డివిజన్లోని శ్రీ చైతన్య హైస్కూల్ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) ఓటువేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక ఓటింగ్ శాతం నమోదు చేయాలని వారు కోరారు.