అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP | ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. వాస్తవానికి ప్రతిపక్షమే ఓటు దొంగ అని విమర్శలు గుప్పించింది.
గాంధీ కుటుంబానికి అత్యంత వినయుడిగా చెప్పకునే కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా(Congress Leader Pawan Khera) వద్ద రెండు యాక్టివ్ ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపింది. ఓటు చోరీ ఆరోపణల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైడ్రోజన్ బాంబు(Hydrogen Bomb) పేల్చడానికి సిద్ధమవుతోందని రాహుల్ గాంధీ హెచ్చరించిన తర్వాతి రోజు బీజేపీ ఈ ఆరోపణలు చేసింది. పవన్ ఖేరా వద్ద రెండు యాక్టివ్ ఓటర్ కార్డులు(Two Active Voter Cards) ఉన్నాయని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఆరోపించారు.
BJP | కాంగ్రెస్ నేతకు రెండుచోట్ల ఓటు హక్కు..
ప్రతిపక్ష పార్టీకి చెందిన పవన్ ఖేరాకు రెండుచోట్ల ఓటు హక్కుందని అమిత్ తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లీ, జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల ఫొటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేస్తూ ఖేరాకు రెండు యాక్టివ్ EPIC నంబర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖేరా ఓటర్ల జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆయననే బీజేపీ నేత అమిత్(BJP Leader Amit) టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రాహుల్ గాంధీ ఇంటి పైకెక్కి “ఓటు చోరీ” అని అరిచాడు. కానీ తన తల్లి సోనియాగాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటర్ల జాబితాలో చేర్పించుకున్న విషయాన్ని చెప్పడం మరిచిపోయారు. ఇక, గాంధీ కుటుంబంతో అతంత్య సాన్నిహిత్య సంబంధాలు ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా – రెండు యాక్టివ్ EPIC నంబర్లను (జంగ్‌పురా, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాలలో, వరుసగా తూర్పు ఢిల్లీ మరియు న్యూఢిల్లీ లోక్‌సభ స్థానాల పరిధిలోకి) కలిగి ఉన్నారని ఇప్పుడు బయటపడింది” అని మాల్వియా విమర్శించారు.
BJP | ఓటర్లను తప్పుదారి పట్టించేందుకే..
కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాల్వియా మండిపడ్డారు. ఖేరా రెండు యాక్టివ్ ఓటర్ల నంబర్లను ఎలా కలిగి ఉన్నారో, అతను ఎన్నిసార్లు ఇలా డబుల్ ఓట్లు వేశారనే దానిపై దర్యాప్తు చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్లను తప్పుదారి పట్టించడానికి, గందరగోళాన్ని సృష్టించడానికి, భారతదేశ బలమైన ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు ఖేరా బీహార్‌లో దురుద్దేశపూరితంగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీకి సంబంధించి చేసిన తప్పుడు ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్‌గాంధీ(Rahul Gnadhi) ఇప్పటికీ అధికారికంగా ఫిర్యాదు చేయలేదని, డిక్లరేషన్ సమర్పించలేదని తెలిపారు. అంతేకాదు, మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే కేసును కొట్టివేసిందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.