అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP Municipal Candidate Suicide | మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా (Narayanpet District)లో చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. సాయంత్రం వరకు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న అభ్యర్థి రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ (Maktal Municipality)లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ఎరుకలి మహదేవప్ప బరిలో నిలిచాడు. సోమవారం ప్రచారం చేశాడు. ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే ఆయన రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
BJP Municipal Candidate Suicide | కాంగ్రెస్ వేధింపులతో..
కాంగ్రెస్ నాయకుల వేధింపులతోనే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనను జైలులో వేస్తామని, ఫోన్లో మెసేజీలు పెట్టి భయపెట్టారన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
BJP Municipal Candidate Suicide | స్పందించిన అధ్యక్షుడు
బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి (BJP Councilor Candidate) ఆత్మహత్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandra Rao) స్పందించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపారు. కాగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని ఆయనపై పలువురు ఒత్తిడి చేసినట్లు సమాచారం. బుధవారం ఎన్నికల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.