అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Vishweshwar Reddy | చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (BJP MP Konda Vishweshwar Reddy) రుమాటైడ్ ఫీవర్‌తో బాధ పడుతున్నట్లు చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచే ఆ సమస్య ఉందన్నారు. అయితే ప్రస్తుతం హార్ట్‌కు సర్జరీ (heart surgery) చేయించుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. తాను బాల్యంలో రుమాటైడ్ ఫీవర్ భారీన పడినట్లు చెప్పారు. దీంతో మోకాళ్ల నొప్పులు, గుండె సమస్యలు (pain and heart problems) వస్తాయన్నారు. చిన్నప్పుడు మోకాళ్ల నొప్పులతో బాగా ఇబ్బందులు పడే వాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే మందులు వాడటంతో నొప్పులు తగ్గాయన్నారు. అయితే గుండెలో వాల్వ్ లీకేజీ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారన్నారు. దీనికి సంబంధించి రెండేళ్లకు ఓ సారి చెకప్ చేయించుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే వైద్యులు ఇన్ని రోజులు ఎలాంటి సర్జరీ అవసరం లేదని చెప్పారన్నారు.
Konda Vishweshwar Reddy | వారంలో కోలుకుంటా
ఇటీవల మరోసారి చెకప్ చేయించుకోగా.. గుండెలోని వాల్వ్‌లో సమస్య పెద్దది అయినట్లు వైద్యులు చెప్పారన్నారు. దీనికోసం శస్త్రచికిత్స చేసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు. దీంతో సోమవారం ఆపరేషన్ చేయించుకుంటానని వెల్లడించారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉంటానని, వారం రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. తన గురించి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో మళ్లీ ప్రజల ముందుకు వస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం తన కార్యాలయం మాత్రం పని చేస్తూనే ఉంటుందని తెలిపారు.
