Homeజిల్లాలునిజామాబాద్​Armoor town | బీజేపీ మోర్చాల అధ్యక్షుల నియామకం

Armoor town | బీజేపీ మోర్చాల అధ్యక్షుల నియామకం

ఆర్మూర్​ పట్టణంలో బీజేపీ మోర్చాల నూతన అధ్యక్షులను నియమించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు మందుల బాలు అధ్యక్షతన సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించారు.

- Advertisement -

అక్షర టుడే, ఆర్మూర్: Armoor town | పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో (MLA camp office) మంగళవారం బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ సందర్భంగా మోర్చాల నూతన అధ్యక్షులను నియమించారు.

బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా (BJYM town president) ఉదయ్ గౌడ్, దళిత మోర్చా అధ్యక్షుడిగా గుండేటి రాజశేఖర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా శేషగిరి లింగం నియమితులయ్యారు. ఈ సందర్బంగా నియామక పత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీను, జెస్సు అనిల్, కలిగుట గంగాధర్, బద్రి, ఆకుల రాజు, ప్రధాన కార్యదర్శి గుగులోత్ తిరుపతి నాయక్, ఉపాధ్యక్షుడు బాండ్లపల్లి నర్సారెడ్డి, పులి యుగేందర్, కార్యదర్శి కుమార్, పోచంపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.